Senior Journalist Imandhi Ramarao : తెలుగు సినిమా ఏకంగా 11 జాతీయ అవార్డులను పలు సినిమాలకు కొట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా చూపింది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు తెలుగు సినిమా హీరోకి నేషనల్ అవార్డు రాకపోగా తాజాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు కొట్టి రికార్డు సృష్టించాడు. అయితే ప్రశంసల వెనుకే విమర్శలు వెంటాడడం మనకు కొత్తేమీ కాదు. మన జనాలు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇంతకు ముందు థియేటర్స్ ముందు కొట్టుకునేవారు ఇపుడు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కి అవార్డు రావడం గురించి కూడ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కాదని అల్లు అర్జున్ కి అవార్డు రావడం పట్ల కొంతమంది విమర్శలను కూడ చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడారు.

ఎన్టీఆర్, చరణ్ లను కాదని బన్నీ కి అవార్డు రావడానికి కారణం…
ఇమంది రామారావు మాట్లాడుతూ నిజానికి అల్లు అర్జున్ కంటే త్రిపులే ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన చాలా క్లిష్టంగా ఉంటుంది కానీ జాతీయ అవార్డు జ్యురి సభ్యులు ఎందుకనో పుష్ప సినిమాకు అవార్డు ఇచ్చారు. అయితే ఇపుడు సోషల్ మీడియా లో వస్తున్న అతి పెద్ద విమర్శ ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన వ్యక్తికి అవార్డు ఇచ్చి అలాగే వేశ్య పాత్ర పోషించిన ఆలియా భట్ కి అవార్డు ఇచ్చి జ్యూరి కమిటీ ఎం చెప్పాలనుకుంటుందో వారికే తెలియాలి అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన ఒక అవిటి వాడి లాగ చాలా సహజంగా బాగా చేసారు అందులో ఏ సందేహం లేదు కానీ ఆ సినిమాలో ఎలాంటి సందేశం లేదు అలాంటి సినిమాకు అవార్డు ఇవ్వడం ఏమిటనేది ఇపుడు అనుమానం అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా మన తెలుగు హీరోకి అవార్డు రావడం సంతోషించదగ్గ విషయం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.