Manasa Charan: ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటీనటులుగా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రియతమ్ చరణ్, మానస దంపతుల గురించి మనకు తెలిసిందే.వీరిద్దరూ పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.ఇలా ప్రేమ పెళ్లి చేసుకుని జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఇదివరకే ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

ఇప్పటికే ఈ జంటకు రెండు సంవత్సరాల కుమారుడు ఉండగా తాజాగా మానస మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.ఈ క్రమంలోనే మానస చరణ్ హాస్పిటల్లో తన కుమారుడిని ఎత్తుకొని ఉండగా తన భర్త ప్రియతమ్ తనతో సెల్ఫీ ఫోటో దిగారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి కొడుకు పుట్టిన సంగతి తెలియజేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు బుల్లితెర నటినటులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మొన్నటి వరకు బేబీ బంప్ ఫోటోలతో అందరిని సందడి చేసిన మానస ప్రస్తుతం మరో పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా వీరి కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఛాలెంజ్ 3 విజేతగా నిలిచిన మానస..
ఇక ప్రియతమ్ చరణ్ మనసు మమత,అడగక ఇచ్చిన మనసు. లక్ష్మీ కళ్యాణం లాంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందారు ఇక మానస చాలెంజ్ 3లో విజేతగా గెలుపొంది ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె కూడా మాటే మంత్రము, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో గుర్తింపు పొందారు.
View this post on Instagram































