Shaakuntalam: సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా మైథాలజికల్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నీలిమ గుణం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నీలిమ గుణ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజు తమకు చాలా సపోర్ట్ ఇచ్చారని తెలిపారు.
ఇక సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని నీలిమ తెలియజేశారు.ఇకపోతే మోహన్ బాబు గారితో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేదే నా కల అయితే ఈ సినిమా విషయంలో ఆకల నెరవేరిందని నీలిమ తెలియజేశారు. ఇకపోతే శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్ పాత్ర గురించి ఈమె పలు విషయాలు తెలియజేశారు.

Shaakuntalam: దుష్యంతుడి పాత్ర పరిమితం కావడమే…
ముందుగా ఈ పాత్రలో చేయడం కోసం ఎన్టీఆర్ ను అనుకున్నామని నీలిమా తెలిపారు. అయితే తారక్ ను సంప్రదించలేదని తెలియజేశారు. దుష్యంతుడి పాత్ర పరిమితం కావడం చేతనే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించలేదని ఈ సందర్భంగా నీలిమ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































