గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్‌లో సంచలనం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది. గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు యజమానిగా వ్యవహరించిన రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మించే స్థాయికి దిగజారడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పోర్న్ చిత్రాల ద్వారా ఆయన పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే అతడి చీకటి కోణాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

ఈ కేసు నడుస్తుండగానే మరికొంత మంది మోడల్స్ బయటకు వచ్చి అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఈ కేసు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బయటపడింది. ఆసమయంలోనే మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ వేదికగా యూకే ప్రొడక్షన్ యజమాని ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు.
సినిమాలో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను.. అవకాశం కచ్చితంగా కల్పిస్తానని చెప్పి.. ఈ ఊబిలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలా తన భర్త వ్యవహారాలు ఒకొక్కటిగా బయటకు వస్తుండటంతో శిల్పాశెట్టికి తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమాలకు దూరంగా ఉన్న శిల్పాశెట్టి టీవీ షోలల్లో జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే వాటికి కూడా గత కొన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు. కొన్ని ప్రొడక్ట్స్ ఉత్పత్తులకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ స్థానాన్ని కూడా వదులుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ముందు ఆమె కనిపించకవోచ్చు అంటూ.. అందరూ అనుకున్నారు.
https://www.instagram.com/p/CStWn_pK3ma/?utm_source=ig_web_copy_link
కానీ తాజాగా ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్నా ‘సూపర్ డాన్సర్-4’కు జడ్జిగా శిల్పా వ్యవహరిస్తున్నారు. ఆమె జడ్జి సీటు ఆమెకు ఇంకా కేటాయించడానికి కారణం ఏంటంటే.. ఈ షో పాపులర్ అవ్వడానికి కారణం శిల్పాశెట్టి అవ్వడమే. అందుకే ఆమె మళ్లీ ఇలా షోలో అడుగుపెట్టారు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భర్త జైల్లో ఉండగా ఇలా శిల్పాశెట్టి షోలు చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
































