Featured
గమనం రివ్యూ: శ్రియ గమనం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా?
Published
3 years agoon
By
lakshanaశ్రియ శరణ్ నటించిన ‘గమనం’ సినిమా ఈరోజు విడుదలయింది. ఈ సినిమాతో సుజనా రావు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక ఇందులో శ్రియ తో పాటు శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహాస్, నిత్యా మీనన్, బిత్తిరి సత్తి, సంజయ్ స్వరూప్, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించాడు. క్రియ ఫిలిం కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞాన శేఖర్ వి.ఎస్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కావటంతో ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.
కథ: ఈ సినిమా కథ మూడు కథలతో కూడి ఉంది. అందులో మొదటిది.. శ్రియ చెవులు వినపడని దివ్యాంగురాలుగా కమల అనే పాత్రలో నటించింది. ఇక ఈమె ఓ మురికివాడ ప్రాంతంలో నివసిస్తుంది. ఈమెకు పెళ్లి అవ్వగా తన భర్త దుబాయ్ లో ఉంటాడు. తనకు ఒక బిడ్డ కూడా ఉంటుంది. తను దుబాయ్ లో ఉన్న తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తన భర్త మాటలు వినాలని చెవులు వినిపించేందుకు చికిత్స కూడా తీసుకుంటుంది. మరొకటి శివ కందుకూరి అలీ అనే పాత్రలో నటిస్తాడు. ప్రియాంక జవాల్కర్ జారా అనే పాత్రలో నటిస్తుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఆలీకి క్రికెటర్ అవ్వాలని కోరిక ఉంటుంది. ఇక చివరి కథలో.. ఇద్దరు అనాథ పిల్లలు ఉంటారు. వారికి పుట్టినరోజు అంటే ఎలా ఉంటుందో అని కూడా తెలియదు. దీంతో కేకు కోసం డబ్బులు సంపాదించుకుంటారు. ఆ తర్వాత ఈ మూడు కథలు అనేవి ప్రకృతి విపత్తులతో మలుపులు గా తిరుగుతుంది. అలా చివరికి ఏం జరుగుతుంది అనేది మిగతా కథలోనిది.
నటినటుల నటన: శ్రియ శరణ్ తన పాత్రతో బాగా ఆకట్టుకుంది. మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రలతో మెప్పించారు.
టెక్నికల్: తొలిసారిగా దర్శకుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్ అద్భుతమైన కథ తీసుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది. సంగీతం ఆకట్టుకుంది.
విశ్లేషణ: ఇక డైరెక్టర్ ఈ కథను తెరపై అంతగా చూపించలేకపోయాడు. చాలా వరకు పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నారు కానీ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్: శ్రియ నటన, కొన్ని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్: సినిమా కాస్త నెమ్మదిగా సాగినట్లు కాకుండా ఉంటే బాగుండేది. ఎమోషనల్ ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది.
బాటమ్ లైన్: తొలిసారి దర్శకత్వంలోనైనా ఈ సినిమాతో కొంతవరకు మెప్పించాడు డైరెక్టర్.
రేటింగ్: 3.0/5
You may like
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోని నటి… ఎవరంటే?
Shriya: ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకుందా.. జర్నలిస్ట్ ని ప్రశ్నించిన శ్రియా శరన్..?
Shriya Saran: నా మొగుడిని నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి.. ట్రోలర్స్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన నటి శ్రీయ శరణ్!
Shreya -Samantha: సమంత మయోసైటిసిస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రియ.. నాకు తెలుసంటూ కామెంట్స్!
Shriya Saran: హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన శ్రియ… ముద్దుల వర్షం కురిపించిన ఆండ్రూ.. ఫోటోలు వైరల్!
Shriya Saran: మొదటిసారి కూతురి ఫేస్ రివీల్ చేసిన నటి శ్రియ… ఎంతో క్యూట్ గా ఉన్న రాధ వైరల్ అవుతున్న ఫోటోలు !
Featured
Devara: చుట్ట మల్లే సాంగ్ డైరెక్టర్ కొరటాల కాదా.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ జాన్వీ?
Published
7 hours agoon
4 October 2024By
lakshanaDevara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే .ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరై ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం చుట్టూ మల్లె పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ జాన్వీ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పాట గురించి పలు ప్రశ్నలు వేశారు. జాన్వీతో ఈ పాటలు చాలా రొమాంటిక్ గా చేశారు మీ వైఫ్ చూసే ఇబ్బంది పడతారు సీన్లు మార్చమని కొరటాల చెప్పలేదా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ జాన్వీ సమాధానం చెబుతూ ఈ పాట షూటింగ్ థాయిలాండ్ లో జరిగింది అప్పుడు కొరటాలకు ఏదో పని కారణంగా అక్కడికి రాలేదు. దీంతో ఈ పాటకు కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేశారు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్ ..
ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతూ ఏంటి ఇంత మంచి హిట్ సాంగ్ చేసినది కొరటాల కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వీ మధ్య రొమాన్స్ మరో లెవల్ అని చెప్పాలి ఈమె కూడా ఎన్టీఆర్ కి అనుగుణంగా డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.
Featured
Ntr: వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా… ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
Published
7 hours agoon
4 October 2024By
lakshanaNtr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆరు రోజులకు బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది.
ఇక ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కొరటాల డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో సందేహాలను కూడా వ్యక్తపరిచారు కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను మించి ఉందని చెప్పాలి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బృందావనం సినిమాతో కొరటాల గారికి నాకు పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మాత్రం ఆయన నా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. ఈ జన్మలో మీకోసం నేను ఎంత చేసినా అది కేవలం వడ్డీ మాత్రమే అవుతుంది. మీ రుణం వచ్చే జన్మలో తీర్చుకుంటాను అంటూ అభిమానులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నా ఫ్యామిలీ మెంబర్..
ఇక దేవర సినిమా మంచి సక్సెస్ కావడంతో దేవర 2 కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాను కూడా దేవర 2 షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Featured
Bramhaji: ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మేడం.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!
Published
9 hours agoon
4 October 2024By
lakshanaBramhaji: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ మంత్రి కొండ సురేఖ నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ మాట్లాడటమే కాకుండా అక్కినేని కుటుంబం పై ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇలా సమంత గురించి అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ మాట్లాడటంతో ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆమె వ్యాఖ్యాలను తప్పుపడుతున్నారు.
ఇక నాగార్జున సైతం పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా కొండా సురేఖ కూడా ఒక మెట్టు దిగివచ్చి క్షమాపణలు చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పిన కేటీఆర్ విషయంలో తాను తగ్గేదే లేదంటూ మరో వీడియోని కూడా ఈమె విడుదల చేశారు. ఇందులో భాగంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు.. అసలు వారి విడాకులకు కారణం ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదు.
ఇండస్ట్రీలో నాకున్న అంతర్గత పరిచయం ద్వారా ఈ విషయం తెలిసిందంటూ కొండా సురేఖ మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో పై బ్రహ్మాజీ స్పందిస్తూ వాళ్ళు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాల మేడం అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పలువురు నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ నా దేవుడు..
ఈ క్రమంలోనే కొంతమంది బూతులతో కామెంట్లు చేస్తున్నారు. వాటిల్లో ఓ నెటిజన్ వాడిన పదజాలన్ని రీ ట్వీట్ చేస్తూ నన్ను తిట్టాలంటే ఓన్ అకౌంట్‌తో, డీపీ పెట్టుకుని తిట్టాలని.. ప్రభాస్ నా దేవుడు ఆయన డీపీ పెట్టుకుని నన్ను తిట్టితే అతన్ని తిట్టినట్టు అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతారని రిప్లై ఇచ్చాడు. పనిలో పనిగా మీ అమ్మగారిని కూడా అడిగానని చెప్పండి అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Devara: చుట్ట మల్లే సాంగ్ డైరెక్టర్ కొరటాల కాదా.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ జాన్వీ?
Ntr: వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా… ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
Bramhaji: ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మేడం.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!
Sujatha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సుజాత.. ఫోటోలు వైరల్!
Pawan Kalyan: తిరుపతి లడ్డు అపవిత్రం చేశారని మేము ఎక్కడా చెప్పలేదే… వారాహి సభలో పవన్ కామెంట్స్!
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
Trending
- Featured4 weeks ago
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
- Featured4 weeks ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured4 weeks ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured4 weeks ago
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
- Featured3 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
- Featured2 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured4 weeks ago
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
- Featured3 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!