కరోనా వ్యాక్సినేషన్ తర్వాత కలిగే దుష్ప్రభావాలివే..!

0
203

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ రెండవ దశ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మన దేశంలో భారత్​ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరం ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్​ ఇస్తున్నారు.

ఈ రెండు వ్యాక్సిన్లు అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ప్రవేశపెట్టినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే దేశ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ కోట్ల మంది ప్రజలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కొందరిలో రియాక్షన్స్ వస్తున్నాయి. దీంతో కొందరు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు లేనని, వాక్సిన్ తీసుకోవడం ఎంతో సురక్షితం అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని అధికారులు తెలియజేస్తున్నారు.

కరోనా టీకా వేయించుకోవడం వల్ల కలిగే తేలికపాటి దుష్ప్రభావాలు:
సాధారణంగా ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా కొద్దిపాటి లక్షణాలు బయటపడతాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల టీకా వేసిన ప్రాంతంలో కొద్దిగా నొప్పిగా ఉండి వాపు వస్తుంది. అదే విధంగా కొందరిలో తలనొప్పి, అలసట, నీరసం, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇవన్నీ కూడా సర్వసాధారణమైన లక్షణాలేనని అధికారులు చెబుతున్నారు.

ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ల సలహాలు తీసుకొని ఆ సూచనలను పాటించాలి. ఈ విధమైనటువంటి నొప్పులు ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా ఉంటే డాక్టర్ ని సంప్రదించి వారి సూచనలను పాటించాలి.వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు లేదా తర్వాత ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here