Singer Sai chand wife Rajani : హైదరాబాద్ కి రెండొందల రూపాయలతో అడుగుపెట్టాడు… తన ప్లేస్ లో నేను చనిపోయి ఉంటే తట్టుకునేవాడు కాదు…: సింగర్ సాయి చంద్ భార్య రజని

0
214

Singer Sai chand wife Rajani : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తన గానంతో రగిలించి తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించిన సింగర్ సాయి చంద్ అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారు. బాల్యం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన సాయి చంద్ విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి కెసిఆర్ ప్రభుత్వంలో గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ రాజకీయంగా భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశపడ్డాడు. అయితే అంతలోనే తన ఆయుష్షు తీరిపోయింది. చిన్న వయసులోనే భార్య బిడ్డలను అనాథలను చేసి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పదవిని ఆయన భార్య రజనికి తెలంగాణ ప్రభుత్వం అప్పగించగా తాజాగా ఇంటర్వ్యూలో ఆమె తన భవిష్యత్ ప్రణాళికలు అలాగే కుటుంబం గురించి మాట్లాడారు.

రెండొందల రూపాయలతో హైదరాబాద్ వచ్చాడు…

సాయి చంద్ జీవితంలో ఆయన ఎదుర్కొన్న కష్టాల గురించి ఆయన భార్య రజని తాజాగా ఇంటర్వ్యూలో చెబుతూ ఆయన కేవలం రెండొందల రూపాయలతో హైదరాబాద్ కి చదువుకోడానికి వచ్చారని చెప్పారు. సాయి చంద్ గారి తండ్రి సామజిక వేత్త అలాగే తల్లి బీడీ కార్మికురాలు కావడం వల్ల పేదరికంలోనే ఆయన బాల్యం సాగిందని రజని తెలిపారు. ఆయన సంక్షేమ వసతి గృహంలో ఉండి చందువుకున్నారని, ఇంట్లో ఉంటే తిండికి ఇబ్బంది అని హాస్టల్ వెళ్లి చదువుకున్నారంటూ చెప్పారు.

ఇక హైదరాబాద్ లో చదువుకోడానికి వచ్చినపుడు ఆయన దగ్గర డబ్బు లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర పనిచేసి కూలిగా రెండొందలు తీసుకుని ఆ డబ్బుతో ఒక జత బట్టలతో హైదరాబాద్ వచ్చి వెల్ఫేర్ హాస్టల్ లో చేరారు. ఆయన కాలేజీ లో చేరిన రెండు నెలలకు నాకు పరిచయం అయ్యారు అంటూ రజని తెలిపారు. ఆయన మరణించాక ఆ షాక్ నుండి తేరుకోడానికి టైం పట్టిందని చెప్పిన ఆమె నా స్థానంలో ఆయన ఉండి నేను మరణించి ఉంటే తట్టుకోలేరంటూ చెప్పారు.