ఏడాది చిన్నారి ప్రాణం కాపాడి మరోసారి దాన గుణం చాటుకున్న.. రియల్ హీరో?

0
162

కరోనా వ్యాపిస్తున్న సమయంలో గత ఏడాది నుంచి కరోనా బాధితుల కోసం తనవంతు సహాయంగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలను ఆదుకొని తన సేవా గుణాన్ని చాటి చెప్పిన నటుడు సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ, ఆక్సిజన్ అవసరం అయ్యే వారికి కొరియర్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్ లను సమకూరుస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడిన సోనుసూద్ తాజాగా ఈ ఏడాది వయసున్న చిన్నారి ప్రాణాలను కాపాడే మరోసారి రియల్ హీరోగా ప్రశంసలు పొందాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్దిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన గౌరవరపు భాస్కరరావు, సత్య దంపతులకు తేజాకృష్ణ ఒక్కడే సంతానం. భాస్కర రావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తేజ కృష్ణ పుట్టుకతోనే గుండెజబ్బు వ్యాధితో బాధ పడటంతో ఆపరేషన్ కాయే డబ్బులు తమవద్ద లేక సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లబోసుకున్నారు.

ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న సోనుసూద్ ఆ చిన్నారికి వైద్యం ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే చిన్నారి తల్లిదండ్రలను ముంబై రప్పించి ఎస్‌ఆర్‌సీసీ పిల్లల ఆసుపత్రిలో గురువారం రోజు శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని తన బిడ్డకు జన్మనిచ్చిన సోనుసూద్ ఉదార స్వభావానికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here