Sruthika : తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన ‘సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్’ సీజన్ 14 అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం కు శ్రీముఖి వ్యాఖ్యత గా వ్యవహరించగా, ఇక న్యాయనిర్ణేతలుగా ఎస్. పి. శైలజ, అనంత శ్రీరామ్, కోటి, స్మిత లు వ్యవహారించారు. ఇక సరిగమప విన్నర్ గా సింగర్ శృతిక నిలిచింది. ఫైనల్ లో మెరిసేటి పువ్వా, ఆనతినీయరా, సంకురాత్రి కోడి వంటి అద్భుతమైన పాటలతో అందరినీ ఫిదా చేసింది. ఇక విన్నర్ గా నిలిచిన శ్రుతికకు రూ. లక్ష నగదు, మారుతీ సుజుకి వ్యాగనార్ కారును గిఫ్ట్ గా అందజేశారు.

అన్నీ.. అలాంటి మెసేజ్లే వస్తున్నాయి…
సరిగమప విన్నర్ గా నిలవడమే కాక, తన పాటలతో ఎందరో అభిమానుల మనసు దోచుకుంది శృతిక. విన్నర్ గా నిలిచిన తరువాత ఇంటర్వ్యూలు, ఇంటరాక్షన్లు అంటూ బిజీ గా వున్న శృతిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మీకు అభిమానుల నుండి మెసేజ్ లు వస్తుంటాయి కదా, వాటిలో మీకు ప్రపోసల్స్ కూడా వస్తుంటాయా అని అడిగిన ప్రశ్నకు, చాలా సరదాగా ఆన్సర్ చేసింది.

చాలా మెసేజ్ లు వస్తుంటాయి. అయితే ఏంటో మరీ నాకు అన్నీ అక్క అక్క అక్క అనే మెసేజ్ లు ఎక్కువగా వస్తాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ ఇలా వస్తుంటాయి అని చెప్పింది. అందరూ నన్ను మరీ అంత పెద్ద దాన్ని అని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. కానీ అక్క అని వాళ్ళ ఫ్యామిలీ లోకి నన్ను కలుపుకున్నారు అని హ్యాపీ గా అనిపిస్తుంది అని చెప్పుకోచ్చింది.






























