Suriya: తమిళ నటుడు సూర్యకు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతే స్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక్కడ కూడా సూర్యకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే జూలై 23వ తేదీ సూర్య తన 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా తెలుగు తమిళనాట అభిమానులు భారీ స్థాయిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఊహించని ఘటన అపశృతి చోటుచేసుకుంది సూర్య ఫ్లెక్సీలు కట్టబోతుండగా ఇద్దరు అభిమానులు మరణించారు.
నరసారావుపేట మండలం మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నక్క వెంకటేష్, పోలూరు సాయి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు. ఈ పెను విషాదం సూర్య అభిమానులని కలచి వేసింది. ఇక ఈ విషయం తెలిసినటువంటి సూర్య అభిమానుల కుటుంబాలను పరామర్శించారు వీడియో కాల్ ద్వారా ఈయన చనిపోయిన అభిమానుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు అనంతరం ఆ రెండు కుటుంబాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Suriya: అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య..
ఓ అభిమాని కుటుంబం మాత్రంతమ బిడ్డను కోల్పోవడంతో మగదిక్కు లేకుండా పోయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే తన సోదరీ డిగ్రీ పూర్తి చేసిన విషయం తెలుసుకున్నటువంటి సూర్య తనకు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను తీసుకున్నారు. పోయిన ప్రాణాలను తాను తీసుకురాలేను కానీ మీ కుటుంబానికి ఏ అవసరం వచ్చిన తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఇలా అభిమానుల కుటుంబాలకు సూర్య అండగా నిలవడంతో మరోసారి ఈయన మంచి మనసు పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Thank you very much @Suriya_offl Garu for responding and being with the family 🥹🙏
We @tarak9999 Fans always with you 🙏#HappyBirthdaySuriya pic.twitter.com/w61XsSxQWS
— Nellore NTR Fans (@NelloreNTRfc) July 23, 2023