వ్యాక్సిన్ వేయించుకోండి.. బంగారం తీసుకెళ్లండి!

0
47

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.అయితే పలు ప్రాంతాలలో వాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో అధికారులు వారికి బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆఫర్ ను ప్రస్తుతం బీహార్‌లోని షియోహార్ జిల్లా అధికారులు ప్రకటించారు.

ఈ విధంగా అధికారులు ఈ జిల్లా ప్రజలకు 45 సంవత్సరాల పైబడిన వారందరికీ జూలై 15వ తేదీలోగా 100% వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం కోసం జిల్లా ప్రజలకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు వారి ఇంటికి ఉపయోగపడే వస్తువులైన బంగారం, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్ వంటి వస్తువులను తీసుకెళ్లవచ్చని ప్రకటించింది.

షియోహార్ జిల్లా అధికారులు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటించడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే ఈ జిల్లాలో ఉన్న సుమారు నలభై మూడు గ్రామాలు వరద ప్రభావిత ప్రాంతాలు. జులై 15 తర్వాత ఈ ప్రాంతాలకు అధికారులు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ లోగా 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ఏడాది వరదల కారణంగా ఈ గ్రామాలన్నీ పూర్తిగా ప్రభావితమయ్యాయి. అందుకోసమే అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఇక్కడి ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. అయితే ప్రజలకు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారనీ ప్రభుత్వ అధికారులు ఈ విధమైనటువంటి ఆఫర్ ప్రకటించారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారందరికీ వారం వారం లక్కీడ్రా ఉంటుందని. ఇందులో లక్కీ డ్రా ద్వారా మొదట తీసిన ఐదుగురికి బహుమతులను అధికారులు అందజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here