సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన టెక్నో.. ధర ఎంతంటే!

0
49

ఇప్పటికే మార్కెట్లో సరి కొత్త సిరీస్ లతో వివిధ రకాల కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే టెక్నో స్పార్క్ 7 సిరీస్ ను ఇదివరకే లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే సిరీస్లో మరొక ఒక కొత్త ఫోన్ ను సదరు కంపెనీ లాంచ్ చేసింది.ఈ సిరీస్ లో వెనక వైపు మూడు కెమెరాలతో పాటు, 90 హెర్ట్జ్ డిస్ ప్లే ఉంది. అదేవిధంగా మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు.

తాజాగా లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 7 పీ స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి 64 జీబీ వేరియంట్ కాగా, మరొకటి 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ ఏం ధర ఎంత అనే విషయం మాత్రం సదరు కంపెనీ వెల్లడించలేదు. అదేవిధంగా ఈ ఫోన్లు మార్కెట్లోకి ఎప్పుడు సేల్స్ కి వస్తాయో తెలియడం లేదు.

ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టెక్నో స్పార్క్ 7 మనదేశంలో రూ.7,499 ధరతో లాంచ్ అయింది. మరి టెక్నో స్పార్క్ 7 పీ ధర కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. సదరు కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 6.8 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే వెనుక వైపు మూడు కెమెరాలు కలిగి ఉన్నాయి. మొదటి కెమెరా 16 మెగాపిక్సల్ సామర్థ్యం ఉండగా, సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సల్ సామర్థ్యం ఉంది.డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇందులో ఉంది. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకవైపు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, మందం 0.91 సెంటీమీటర్లుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here