దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై పడుతున్న సంగతి విదితమే. కరోనా వల్ల లాక్ డౌన్ అమలైన సమయంలో మందుబాబులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మద్యం దొరక్కపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే కేంద్రం రాష్ట్రాలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం మే నెల నుంచి మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే వైన్ షాపులకు కేంద్రం నుంచి అనుమతి లభించినా కొన్ని విషయాల్లో రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ బార్లు, క్లబ్బులపై నిషేధం కొనసాగించింది. బార్లు, క్లబ్బులపై నిషేధం అమలు కావడంతో మందుబాబులు ఎప్పుడు వీటిపై నిషేధం ఎత్తేస్తారా…? అని ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు మద్యం ప్రియుల ఎదురుచూపులకు తగిన ఫలితం దక్కింది. అయితే పర్మిట్ రూమ్ ల విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.
 
ప్రభుత్వం బార్లు, క్లబ్బులకు అనుమతులు ఇచ్చినా కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని.. నిబంధనలు అమలు చేయని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బార్లు, క్లబ్బులకు అనుమతులు ఇచ్చినా డ్యాన్సులు, మ్యూజిక్ ఈవెంట్లపై యథావిధిగా నిషేధం అమలు కానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి రానుంది.
 
థర్మల్ స్క్రీనింగ్ , పార్కింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు బార్ లో పని చేసేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. బార్ పరిసరాలను ఉదయం, సాయంత్రం శుభ్రం చేయాలని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here