దేశంలో కరోనా సెంకండ్ వేవ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లు విధించాయి. తాజగా తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు కరోనా పరిక్షలు చేయించుకోగా ఆ టెస్టుల్లో ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ ఆని నిర్ధారణ అయింది.

దీనితో వైద్యుల సూచనల మేరకు ఆమె హోం ఐసోలేషన్ కి వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో గత కొద్దికాలంగా తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు అందరూ కరోనా టెస్టులు చేయిచుకోవాలని సూచించారు.



































