ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో.. ప్రజలు దేశాన్ని వదిలి తరలిపోతున్నారు. దీంతో కాబుల్ ఎయిర్పోర్టులో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ నుండి తరలిపోతున్న ప్రయాణికులపై యూఎస్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.


ఇక ఆఫ్ఘన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో పాఠశాలలు కార్యాలయాలు ఇప్పటివరకు తెరచుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో తాలిబాన్లు ఇళ్లలోకి చొరబడి లూటీలకు తెగబడుతున్నారు.


































