ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఆ దంపతులు వేరే కాపురం పెట్టారు. అన కోడలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడని అత్త వాళ్లను దూరం పెట్టేసింది. దీనిపై తన భర్త కూడా మాట్లాడకపోవడంతో కోపం పెంచుకుంది. చివరకు ఏం చేసిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. రాజస్థాన్‌లోని ముంగెడ్ అనే గ్రామంలో నాథూ యాదవ్ అతడి తల్లి 65 ఏళ్ల బేవా గులాబ్ నివసిస్తున్నారు. అతడికి ఆరు నెలల క్రితం కాంతాను అనే మహిళతో పెళ్లి జరిగింది.

అయితే ఈ పెళ్లి గులాబ్ కు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెకు అప్పటికే పెళ్లై భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. దీంతో ఆమె తన కొడుకు, కోడలిని ఇంట్లో కూడా ఉండనివ్వలేదు. పెళ్లైన వెంటనే వేరే కాపురం పెట్టించింది. ఈ తతంగం అంతా జరుగుతున్నా నాథూ యాదవ్ తన తల్లికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాడు. దీంతో కాంతాను తీవ్ర మనస్థాపానికి గురైంది.
భర్తపై అంతే కాకుండా అత్తపై కోపం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే మందుకు బానిసగా మారింది. ఇలా ఓ రోజు ఫుల్ గా తాగి వచ్చి తన భర్తను చంపేసింది. అదే కోపంతో తన అత్త ఇంటికి వెళ్లి.. నీ కొడుకును చంపేశా.. ఇక నీతోనే ఉంటా అని చెప్పింది. ఆమె మొదట నమ్మలేదు. నాలుగు రోజుల తర్వాత వాళ్లు వేరే కాపురం పెట్టిన గది చుట్టు పక్కల వాళ్లకి వాసన రావడం మొదలైంది.
దీంతో కాంతాకు ఫోన్ చేసి మీ ఇంట్లో వాసన వస్తుంది అని చెప్పారు. ఈ విషయం అత్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే తన అత్త కొడుకు ఇంటికి వెళ్లి చూడగా తన కొడుకు కుళ్లిపోయి వాసన కొడుతూ ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది బేవా గులాబ్. కాంతాను అక్కడ నుంచి పారిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న కాంతాను కోసం గాలిస్తున్నారు.




























