రవితేజ కాళ్లు కడిగిన సీనియర్ నటుడు.. ఎందుకో తెలుసా ?

0
290

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరని చెప్పవచ్చు. రవితేజ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత హీరోగా సినీ అవకాశాలను అంది పుచ్చుకుంటూ ప్రస్తుతం మాస్ మహారాజ్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

రవితేజతో పాటు ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చి అతనితో పాటు ప్రయాణం చేశారు. ఈ విధంగా రవితేజతో కలిసి రఘు కుంచే, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్, రాజా రవీంద్ర వంటి నటులు కూడా ఉన్నారు. రవితేజ ప్రతి కష్టంలోనూ వీరు కూడా తన వెంటే ఉండి తన కష్టాలను పంచుకున్నారు.తాజాగా నటుడు రాజా రవీంద్ర క్రేజీ అంకుల్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ రవితేజ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రవితేజతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని, రవితేజ తనని ఎప్పుడు మామ అని పిలుస్తుంటారు అని చెప్పారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ ఒక సందర్భంలో రవితేజ కాళ్లు కూడా కడిగానని రాజారవీంద్ర పేర్కొన్నారు. అసలు రవితేజ కాళ్లు కడగడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

రవితేజ పెళ్లి సమయంలో తనకు కాళ్లు కడిగి కన్యాదానం చేయాల్సిన అత్తమామలు అనారోగ్య సమస్య కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే రాజారవీంద్రని రవితేజ మామ అని పిలుస్తున్న కారణం చేత పెళ్లి సమయంలో రవితేజ కాళ్ళు కూడా కడిగానని ఈ సందర్భంగా రాజా రవీంద్ర రవితేజకు తనకి మధ్య ఉన్న బంధం గురించి వెల్లడించారు. ఇక స్టార్ హీరోగా రవితేజ గుర్తింపు పొందిన సమయంలో తనని మేనేజర్ గా చేసి తన డేట్స్ అన్ని చూసుకునే వ్యవహారాలను తనకు అప్పగించారని ఈ సందర్భంగా రాజ రవీంద్ర రవితేజ గురించి తెలియజేశారు.

అదే సమయంలో రవితేజ తో వచ్చిన క్లాష్ గురించి మాట్లాడుతూ.. ఆయనకి ఎవరో నా గురించి ఏవేవో చెప్పడం మొదలు పెట్టారు. కొద్దిరోజులు భరించిన రవితేజ ఆ తరువాత “మనిద్దరం హీరో, మేనేజర్ కంటే ఫ్రెండ్స్ గా ఉండిపోవడమే బెటర్ ఏమోరా” అని అన్నాడు.. అయన అలా అనే సరికి నేను ఇంకేం మాట్లాడలేదు.. “ఓకే రా ఆల్ ది బెస్ట్” అని చెప్పేసి వచ్చేసా.. ఇప్పటికీ ఫ్రెండ్ గా కలుస్తూనే ఉంటాం. అని చెప్పారు రాజ రవీంద్ర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here