ప్రతీరోజు వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో చిరుతిళ్లు అధికంగా తినడం వల్ల ఉబకాయం భారీగా పెరిగిపోతుంది. దీంతో ఈ విషయం పై ప్రత్యేకంగా బ్రిటన్ ప్రభుత్వం దృష్టి సారించింది. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ.. పండ్లు, కూరగాయలను నిరంతరం తీసుకునే కుటుంబాలకు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

ఇంగ్లాండ్ లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఊబకాయం సమస్య బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వ్యక్తులు బరువు తగ్గే కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందడానికి కుటుంబాలకు నగదు బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశమున్నట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి.
ఊబకాయం సమస్యను పరిష్కరించడానికి ప్రజలు పండ్లు, కూరగాయలు తీసుకునేలా యూకే ప్రభుత్వం పర్యవేక్షించనుందని నివేదికలు స్పష్టం చేశాయి. అయితే వీటిపై ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించనున్నారు. సూపర్ మార్కెట్ కి వెళ్లిన సామాన్యుడికి ఎంత ఖర్చు అవుతుందో అలా.. ఆ ఖర్చుకు నిధులను పర్యవేక్షించనున్నారు.
దీంతో పాటు ఎక్కువ పండ్లు, కూరగాయలు కొనడం ద్వారా క్యాలరీలను తగ్గించుకునేవారు బహుమతులు పొందుతారని ఈ నివేదికలు తెలిపాయి. ఎక్ససైజ్ కి వెళ్లే వారి కోసం 7 లక్షల పౌండ్ల వరకు రివార్డు చెల్లించనుందట. ఇలా రివార్డులు ప్రకటిస్తారని అక్కడి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధిక బరువు కారణంగా పరోక్షంగా కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని.. దాని నుంచి రక్షణ పొందడానికే ఇలాంటివి ప్రకటిస్తున్నట్లు అక్కడి ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.































