వామ్మో.. మహిళ కంటిలో 27 కాంటాక్ట్ లెన్సులు… కేవలం 35 ఏళ్ల నిర్లక్ష్యమే కారణం!

0
430

ప్రస్తుత కాలంలో చాలామందికి చిన్నవయసులోనే కళ్ళజోడు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కళ్ళజోడు పెట్టుకుంటే తమ అందానికి అడ్డుగా ఉంటుందని భావించే చాలామంది కాంటాక్ట్ లెన్స్ లు ఉపయోగిస్తున్నారు.అయితే కాంటాక్ట్ లెన్సులు ధరించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాలి లేకపోతే ఈ మహిళ ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

యూకేకు చెందిన 67 ఏళ్ల మహిళ ఇటీవల తన కళ్లు, పొడిబారిపోయాయని, దురద పెడుతున్నాయని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు షాకింగ్ విషయం తెలిసిందే. వయసు పెరగడంతో ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె కుడి కన్నును పరీక్షించగా.. కుడి కన్ను గుడ్డు వెనుక కాంటాక్ట్ లెన్సులు పేరుకుపోయి ఉండడం గమనించి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే డాక్టర్లు క్రమంగా ఒక్కొక్క దానిని బయటకు తీశారు.

సుమారుగా మహిళ 35 సంవత్సరాల నుంచి కాంటాక్ట్ లెన్స్ లు ఉపయోగిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నిర్లక్ష్యం వల్ల కాంటాక్ట్ లెన్స్ తీయకుండా అవి ఎక్కడో మర్చిపోయానన్న ఉద్దేశంతో మరో కొత్త కాంటాక్ట్ లెన్సులను వాడేది. ఈ విధంగా తన కంటిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు పేరుకుపోయాయి.

ఈ సందర్భంగా ఆమెకు వైద్యం అందించిన ఆప్తాల్మాలజీ స్పెషలిస్ట్ ట్రైనీ రుపల్ మొర్జారియా మాట్లాడుతూ.. ఇలాంటి కేసును తన సర్వీసులో ఎప్పుడూ చూడలేదని, అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ వల్ల ఆ మహిళ చూపులో ఎలాంటి సమస్య ఏర్పడి లేదని తెలిపారు.కేవలం తన నిర్లక్ష్యం కారణంగానే 65 ఏళ్ల వయసులో ఈ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటోందని కాంటాక్ట్ లెన్సులు ధరించే వారు తప్పకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.