Upendra: తన ఫామ్ హౌస్ అద్దెకు ఇవ్వబోతున్న కన్నడ స్టార్ హీరో… ఎందుకంటే?

  0
  135

  Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన కన్నడ సినిమాలు పలు తెలుగులో కూడా విడుదలై ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అదేవిధంగా ఉపేంద్ర తెలుగులో కూడా సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతూనే పలు వ్యాపారాలను కూడా ఈయన చేస్తున్నారు.

  ఇలా బిజినెస్మేన్ గాను హీరో గాను మంచి సక్సెస్ అయినటువంటి ఉపేంద్ర తాజాగా తన ఫామ్ హౌస్ అద్దెకు ఇవ్వబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఉపేంద్ర బెంగళూరు మైసూర్ రోడ్డుకు తన ఫామ్ హౌస్ ఉందని తెలిపారు. అయితే ఈ ఫామ్ హౌస్ లో తాను ఎప్పుడూ ఉండనని అందుకే దీనిని ఖాళీగా ఉంచడం దేనికని భావించి అద్దెకు ఇవ్వబోతున్నానని తెలియజేశారు.

  మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ పెళ్లిళ్ల కోసం లేదా ఇతర శుభకార్యాల కోసం తాను అదే ఇవ్వబోతున్నానని ఎవరికైనా అవసరమైతే తనని సంప్రదించాలి అంటూ ఒక ఫోన్ నెంబర్ ఇస్తూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫామ్ హౌస్ దాదాపు నాలుగు ఎకరాల్లో ఉంది.

  Upendra: శుభకార్యాల కోసం…


  ఇందులో పెద్దగా పదివేల చదరపు అడుగుల హాల్, బార్, 6 విలాసవంతమైన బెడ్ రూమ్స్, పెద్ద టెర్రస్, పదివేల చదరపు అడుగుల ఖాళీ స్థలం, నాలుగు గదులు.. ఇలా చాలా సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఉపేంద్ర భలే ఆలోచించారు అంటూ కొందరు కామెంట్ చేయగా,మరికొందరు మాత్రం ఏంటి ఉపేంద్ర సినిమా అవకాశాలు లేక డబ్బులు తక్కువ అయ్యాయా అందుకే ఇస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు.