తల తిరుగుతుందా… అయితే ఇది వెర్టిగో?

0
85

చాలా మందిలో కొన్నిసార్లు ఉన్నఫలంగా తల తిరిగినట్లు అనిపించడం, వారి చుట్టూ ఉన్న వస్తువులు కూడా తిరుగుతూ కనిపించడం వంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు భావన కలిగితే అది ఖచ్చితంగా వెర్టిగో వ్యాధిగా భావించాలి. అయితే ఈ విధమైనటువంటి వెర్టిగో సంభవించినప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కనపడతాయి? ఏ విధంగా చికిత్స తీసుకోవాలి? మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

వెర్టిగోకి కల కారణాలలో బీపీపీవీ, ఇన్‌ఫెక్షన్, మెనియెర్స్ డిసీజ్, ఉంటాయి.

  • బీపీపీవీ: బినైన్ ప్యారోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో అనేది వెర్టిగోకి ఉన్న కామన్ కారణాలలో ఒకటి. దీనివల్ల ఉన్నఫలంగా మన తల తిప్పడం, మన చుట్టూ తిరుగుతున్న వస్తువులు కూడా తిరుగుతున్నట్లు కనిపిస్తాయి.

*ఇన్‌ఫెక్షన్: వెస్టిబ్యులర్ న్యూరైటిస్ అనబడే వెస్టిబ్యులర్ నెర్వ్‌లో ఉండే ఇన్ఫెక్షన్ కారణంగా మనలో వెర్టిగో ఇంటెన్స్‌గా ఉంటుంది.

  • మెనియెర్స్ డిసీజ్: ఈ విధమైనటువంటి మెనియెర్స్ డిసీజ్, చెవి లోపలి భాగంలో ఫ్లూయిడ్ ఏర్పడటం వల్ల
    గంటల పాటూ ఉండే వెర్టిగో సడన్ గా వస్తుంది.

లక్షణాలు:
వెర్టిగోకి కామన్‌గా ఉండే లక్షణాలలో డిజ్జీనెస్ ఒకటి. దీని ద్వారా మన తల ఎంతో వేగంగా తిప్పినట్లు అయిపోయి పడిపోతామనే భావన కలుగుతుంది. అదే విధంగా ఈ విధమైనటువంటి ఈ సమస్యతో బాధపడే వారిలో వాంతులు, వికారం, అధికంగా చెమట పట్టడం వంటి లక్షణాలు తలెత్తుతాయి.ఈ విధమైనటువంటి సమస్యకు అది ఏ కారణం చేత వచ్చిందనే విషయాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.వెర్టిగో వల్ల వచ్చే అసౌకర్యానికి కొన్ని రకాల వ్యాయామాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి వ్యాయామాల ద్వారా కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here