1978 ప్రాణంఖరీదు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కోట శ్రీనివాసరావు అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకు లో ఒక ఉద్యోగిగా పని చేసేవారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసేవాడు. ప్రాణం ఖరీదు లో క్లైమాక్స్ లో వచ్చే చిన్న వేషం వేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లారు.

ఒక నాటకంలో దర్శకుడు జంధ్యాల కోట శ్రీనివాసరావు ను చూసి మూడు ముళ్ళు అనే చిత్రానికి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరో నాటకం రవీంద్రభారతిలో జరుగుతుండగా కోట శ్రీనివాస్ రావు స్టేజి మీద చూసి తను తీయబోయే ప్రతిఘటన సినిమా లో కాశీ పాత్రను ఇవ్వాలని దర్శకుడు టి. కృష్ణ అనుకున్నారు.

ప్రతిఘటన లో వేసిన కాశీ అనే రాజకీయ నాయకుడి పాత్ర కోట శ్రీనివాసరావు కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి కోట శ్రీనివాసరావు వెనుతిరిగి చూడలేదు. జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంలో తెలంగాణ మాండలికంలో రామాయణం స్టోరీ చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్ళంట చిత్రంలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు చేసిన నటన కొత్తగా ఉంటుంది.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాలో గురు నారాయణ అనే విలన్ పాత్రలో తెలంగాణ స్లాంగ్ లో చెప్పే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ అనే చిత్రంలో చిన్నప్పటి నుంచి నేరాలు చేస్తూ రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగానని తెలంగాణ మాండలికంలో చెప్పే సంభాషణలు నభూతో న భవిష్యత్ గా ఉంటాయి. తలపై ఒక్క వెంట్రుకపోస లేకుండా పూర్తి గుండు ముఖంతో కనిపిస్తూ ప్రేక్షకులను భయపెట్టిస్తాడు. అయితే

ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తన కెరీర్లో విభిన్నమైన పాత్రలను ధరించానని అందులో తెలంగాణ మాండలికంలో చెసిన పాత్రలు చాలా పేరు తీసుకు వచ్చాయని గణేష్ చిత్రంలోని ఫేమస్ డైలాగ్ చెప్పి కోట శ్రీనివాసరావు తన ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here