చాలా మందికి పర్యావరణాన్ని రక్షించడం, మొక్కలు నాటడం, నాటిన మొక్కలను రక్షించడం అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే పర్యావరణంతో మమేకమై ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ విధంగా పర్యావరణ ప్రేమికులు పర్యావరణంతో కలిసి జీవించడం కోసం ఎంతకైనా సాహసం చేస్తారు. ఈ క్రమంలోనే వారు చేసే కొన్ని ప్రయత్నాలు ఎందరినో ఆశ్చర్యపరచే ఈ విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఓ యువకుడు చేసిన అటువంటి ప్రయత్నానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాకు చెందిన పంచు గగ్రామానికి చెందిన ఒక యువకుడు తన ఇంటి సమీపంలోనే ఒక ఎత్తయిన వృక్షం ఉంది. అయితే రాజస్థాన్లో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా,ఈ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఆ యువకుడు సరికొత్త ఆలోచన చేసి ఏకంగా చెట్టుపైనే ఇంటి నిర్మించాడు.
ఈ విధంగా యువకుడు తన ఇంటి సమీపంలోనే ఉన్న చెట్టుపై ఏకంగా ఇంటిని నిర్మించి ఆ ఇంటిలోనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలోని సదరు యువకుడు మాట్లాడుతూ ఈ ఎండల నుంచి తనకు చెట్టుపైనే ఉపశమనం కలిగిందని, అందుకోసమే ఈ విధంగా చెట్టుపై ఇంటిని నిర్మించుకునట్లు తెలిపాడు.ప్రస్తుతం ఈ యువకుడు నిర్మించిన హౌస్ ట్రీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంది. ఈ విధంగా యువకుడు చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిందని చెప్పవచ్చు.































