ప్రేమ నిజంగా చాలా మధురమైనదా?? ప్రేమిస్తే దేనికైనా తెగిస్తామా?? మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రేమకథలు చూసుంటారు?? ఓటమి లేని ప్రేమ కథలను ఎన్ని వినుంటారు? ప్రేమ కోసం తుపాకీ చేతపట్టుకుని, ముప్పై ఏళ్ల పాటు అడవిలోనే ఉంటూ, చుట్టాలకి దూరంగా చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఎన్నో కష్టాలు… నిద్రలేని రాత్రులు… ఇదంతా దేనికోసం..ప్రేమ అనే బంధం ఉండబట్టే నా… అసలు ప్రేముంటే చాలా ఇంకేం అవసరం లేదా?? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం ఒకరి జీవితం నుంచి నేర్చుకోవచ్చు… ఆమే పేరే జజ్జర్ల సమ్మక్క.

ఆమే ప్రేమ.. ఆలౌకికం..ఆత్మీకం.. అపురూపం… అంటూ విరాతాపర్వం టీజర్ రాగానే అందులో సాయి పల్లవి రానా కోసం వెతుక్కుంటూ ఊరు వాడ.. వాగు వంక ధాటి అడవుల్లోకి ప్రయాణింస్తుంది… ఈ కథ జజ్జర్ల సమ్మక్క ది… నిజం జీవితంలో ప్రేమ కోసం.. తన బావ కోసం సమ్మక్క కూడా అన్నీ బంధాలను వదిలి అడవిబాట పట్టింది…మావోయిస్టుగా మారిన బావ కోసం అడవి అంత గాలించి.. వెతికి పట్టుకొని…అక్కడే పెళ్లి చేసుకొని…పిల్లల్ని కూడా వద్దనుకొని బావ కోసం తుపాకీ పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలం మడగూడెంకు చెందిన సమ్మక్క, నారాయణలు సొంతం బావామరదళ్లు. చిన్నప్పటి నుంచి ఒకరంటే మరొకరికి ప్రాణం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన యాప నారాయణ, విద్యార్థి దశలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్‌యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు.

అయితే, బావను ఎంతగానో ఇష్టపడి చదువు పూర్తయ్యాక వచ్చి తనని పెళ్లిచేసుకుంటాడు అని భావించిన మరదలుకి దళంలో చేరిన బావ మీద ఇష్టం మాత్రం తగ్గలేదు. కొన్నేళ్లు బావ కోసం ఎదురుచూసింది… కానీ బావా రాలేదు.. దాంతో సొంతూరు, సొంతవారు అనే బంధాలను తెంచుకుని, బావను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి, పిల్లలను వద్దనుకుని మాతృత్వాన్ని త్యాగం చేసి బావ అడుగుల్లో అడుగై, ఆశయాలు పంచుకుంటూ బతకసాగింది. అయితే 2008లో సమ్మక్కకు ఆరోగ్యం పాడయ్యింది. ఇక చేసేది లేక పోలీసులకు లొంగిపోయింది. అప్పుడు పోలీసులు ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డును ఆమెకే అందజేశారు. ఆ డబ్బుతో ఆపరేషన్ చేయించుకొని కొన్నాళ్ళు ఇక్కడే జన సందోహం లో జీవించిన అనంతరం 2012లో ఆమె మళ్లీ అడవిలోకి బావ వద్దకే వెళ్లిపోయింది. అప్పటినుంచి మళ్లీ ఆమె అడవి నుంచి బయటకు రాలేదు.

అయితే గతేడాది వీళ్ళ ప్రేమకు ఎండ్ కార్డు పడింది.. కరోనా మహమ్మారి వీళ్ళని బలి తీసుకుంది. జూన్ 21వ తేదీన హరిభూషణ్ కరోనాతో చనిపోగా.. 24న సమ్మక్క చనిపోయింది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు జరిగాయి. మనం పైన చెప్పుకున్నట్టు.. ప్రేమకి ప్రేమించిన వ్యక్తి తప్పా… డబ్బు, స్టేటస్, కార్లు, బంగ్లాలు ఇలా ఏమి అవసరం ఉండదు.. అని ఈ ప్రేమ జంటను చూసి మనం అర్ధం చేస్కోవచ్చు.



































