పుష్ఫ పాన్ ఇండియా లెవల్లో నేడు దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ ఊరమాస్ గెటప్ లో కనిపించగా… కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా డీగ్లామర్ రోల్ లో కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కేంద్రంగా సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించాడు. ఇప్పటికే తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ.

రిలీజ్ కు ముందు సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. బెంగళూర్, చెన్నై, హైదరాబాద్ లలో ప్రమోషన్ కార్యక్రమాలకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా హాజరయ్యారు. సినిమాలో విశేషాలను పంచుకున్నారు. అయితే ఈప్రమోషన్ కార్యక్రమాల్లో రష్మికా చాల ఓవర్ చేసిందంటూ నెటిజన్లు ఇప్పటికే ట్రోలింగ్ మొదలు పెట్టారు.
ఇదిలా ఉంటే మరో విషయంపై కన్నడ అభిమానులు రష్మికాపై కోపం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ బ్యూటీ అయిన రష్మిక పుష్ప సినిమా కోసం కష్టమైన చిత్తూరు యాసను నేర్చకుంది రష్మిక. తనే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. అయితే ఇప్పుడు ఇదే విషయంపై కన్నడ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు. పరాయి భాషలో డబ్బంగ్ చెప్పడానికి టైం ఉంది కానీ… సొంత భాషలో డబ్బింగ్ చెప్పడానికి టైం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈవిషయంపై రష్మిక కూడా స్పందించింది. అయితే పుష్ప రెండో పార్ట్ కు మాత్రం ఖచ్చితంగా డబ్బింగ్ చెప్తా అని కన్నడ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చింది. తాను కావాలని ఇలా చేయలేదని చెప్పుకుంటూ వచ్చింది. అయితే కొంత మంది మాత్రం రష్మిక ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ ఉండటం వల్లే ఇలా చేసిందని.. కావాలని చేయలేదని చెప్పుకుంటున్నారు.































