ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం. మన శరీరానికి ఎక్కువ పోషక విలువలు పొందాలంటే తాజాగా పండిన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. వీటితో పాటు మొలకలు వచ్చిన గింజలు కూడ మన ఆరోగ్యానికి ఎ ఎన్నో పోషక విలువలను అందిస్తాయి.ఈ గింజలను నీటిలో నానబెట్టి సరైన గది ఉష్ణోగ్రత వద్ద గట్టిగా కట్టడం వల్ల మొలకలు వస్తాయి. ఈ మొలకెత్తిన గింజలు తీసుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.

సాధారణంగా మన ఇంట్లో లభించే పెసలు, సోయా బీన్స్ కిడ్నీ బీన్స్ వంటి వాటిని మొలకలు కట్టి తీసుకోవటం వల్ల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ విధంగా ప్రతి రోజు మొలకలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజు మొలకెత్తిన గింజలు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఎంజైమ్స్ మెటబాలిజం రేటును పెంచుతాయి.
మనం తీసుకునే ఆహారంలో అధిక భాగం పోషకాలు ఉండటం వల్ల ఇది మన శరీర బరువును నియంత్రించడానికి పూర్తిగా సహకరిస్తాయి. మొలకలు వచ్చిన గింజలలో అధిక భాగం యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి. దీనితో ఈ సమస్య కూడా పోతుంది.మొలకలలో హృదయానికి మరియు గట్ కి హాని కలిగించే గుణాలు లేవు. కనుక ప్రతిరోజూ మొలకెత్తిన గింజలు తీసుకోవటం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుందని చెప్పవచ్చు.
అదేవిధంగా మొలకలు కట్టిన గింజలలో అధికభాగం విటమిన్లు అధికంగా ఉండటంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.ఇవి చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా దోహదపడతాయి. మొత్తానికి మొలక కట్టిన గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చనీ నిపుణులు చెబుతున్నారు.































