AP: దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలోనే విజయవాడ పార్టీ కార్యాలయం ఎదుట వైయస్సార్సీపీ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంబంటి రాంబాబు వంటి వారందరూ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో వైసిపి ఓటమి కావడానికి కారణం చంద్రబాబు అబద్ధాలేనని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా కుల మతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారు.
ఇకపోతే చంద్రబాబు నాయుడు ఎలాగైనా అందలం ఎక్కాలన్న ఉద్దేశంతో తప్పుడు హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేశారని ఇలా ఈయన మోసం చేయడంలో బాగా సక్సెస్ అయ్యారని అదే ఆయన విజయానికి కారణం అంటూ సజ్జల తెలిపారు. ఇప్పుడు కూటమి ఇచ్చిన హామీలలో 10 శాతం నెరవేర్చిన చాలని సజ్జల వెల్లడించారు.
బాబు ప్రజలను మోసం చేశారు..
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైయస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇలా సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తూ చంద్రబాబు సక్సెస్ అయ్యారు కానీ జగన్ పద్ధతి అలా కాదు అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్ కి ఇష్టం లేదంటూ సజ్జల చేసి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

































