పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో పవన్ వ్యాఖ్యలను ఖండించారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై సినీ నటుడు రచయిత పోసాని పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు కారణంగా పవన్ అభిమానులు పోసాని మురళి కృష్ణ పై దాడులు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే పోసాని మురళి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పంజాబీ హీరోయిన్ ను మోసం చేశాడని, తనని ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించారనే ఆరోపణలు చేయడంతో పవన్ అభిమానులు ఆగ్రహంతో అతనిపై అతని ఇంటిపై దాడులు చేశారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.

ఇదిలా ఉండగా తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పంజాబీ అమ్మాయి విషయం తెరపైకి వచ్చింది. సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి మనకు తెలిసి ముగ్గురు భార్యలు మాత్రమే. తెలియకుండా ఎంతమంది ఉన్నారో అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలోనే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పంజాబీ నటి పూనమ్ కౌర్ ను ప్రేమించి తనను గర్భవతిని చేసి, ఆపై అబార్షన్ చేయించారని ఆరోపించారు. ఈ విషయం బయటకు రానివ్వకుండా ఆమెకు ఐదు కోట్లు ఇచ్చి వారి కుటుంబ సభ్యుల నోటిని మూయించాడని వైసిపి మంత్రిని సన్నాసి అన్న పవన్ కళ్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

































