ప్రపంచ దేశాలన్నింటికీ పై కరోనా మహమ్మారి వివిధ రూపాలలోకి పరివర్తన చెందుతూ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో వ్యాప్తి చెందిన రెండవ దశ వేరియంట్ ఎంతటి నష్టాన్ని కలుగజేసిందో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ ప్రభావం నుంచి ఇండియా కోలుకుంటుంది. ఇదిలా ఉండగా రష్యాలో కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
రష్యా రాజధాని మాస్కోలో నగరంలో కొత్త వేరియంట్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ సరికొత్త కొత్త వేరియంట్‌ను మాస్కో లో గుర్తించగా దానికి కూడా ‘మాస్కో వేరియంట్’గా నామకరణం చేసారు. రష్యా రాజధానిలో కొన్ని వారాల్లో కేసులు మూడు రెట్లు పెరిగాయి. దీంతో ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

కొత్తగా ఏర్పడిన ఈ వైరస్ పై స్పుత్నిక్ వి ఎంత వరకు పనిచేస్తుంది అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ పై స్పుత్నిక్ సమర్థవంతంగా పని చేస్తుందనే నమ్మకం ఉందని గమలేయా నేషనల్ సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో మాస్కో నగరంలో శుక్రవారం నాటికీ కొట్టగా 9,056 కేసులు గుర్తించడం జరిగింది. అయితే రెండు వారాల కిందట ఈ సంఖ్య 3వేలు ఉండగా.. 2020లో మొదట్లో కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.



























