టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది.గత నాలుగు రోజుల నుంచి వరుసగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఒకరి మరణవార్త తెలుసుకుని ఆ మరణవార్త నుంచి కోలుకోకముందే మరొకరు వరుసగా చనిపోవడంతో చిత్ర పరిశ్రమ ఎంతో విచారణ వ్యక్తం చేస్తోంది.

నవంబర్ 27వ తేదీ ప్రముఖ దర్శకుడు నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించడంతో ఒక్కసారిగా సినీప్రముఖులు షాక్ అయ్యారు. ఇలా ఈయన మరణ వార్త నుంచి తేరుకునేలోగా నవంబర్ 28వ తేదీ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో నృత్య దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడి తుది శ్వాస విడిచారు.
వీరిద్దరి మరణవార్త నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ బయటపడక ముందే ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30వ తేదీ న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. ఇలా నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు సినీ ప్రముఖులు మృతి చెందడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్ అయింది.
ఇక ఇలా వరుసగా సినీ ప్రముఖులు చనిపోవడంతో పలువురు సినీ సెలబ్రిటీలు వీరి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీరితో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఇక సీతారామశాస్త్రి అంత్యక్రియలను నేడు సాయంత్రం జరుగనున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని ఫిలింఛాంబర్లో ఉంచారు పలువురు అక్కడికి చేరుకుని అతనికి నివాళులు అర్పిస్తున్నారు.































