సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న వారిలో తనికెళ్ల భరణి ఒకరు. ఒక తండ్రి పాత్రలో, బావ పాత్రలో నటించిన తనికెళ్ల భరణి మరి కొన్ని సినిమాలలో విలన్ గా నటించి అసలు విలనిజం బయట పెట్టేవాడు. ఈ క్రమంలోనే 1993 లో విడుదలైన “మాతృదేవోభవ” సినిమా ఇండస్ట్రీలోనే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తే కంటనీరు పెట్టకుండా ఉండలేము.

ఈ సినిమాలో భర్త చనిపోయిన స్త్రీ తన పిల్లల కోసం ఆరాట పడగా ఆ క్రమంలోనే ఆమెకు క్యాన్సర్ అని తెలియడంతో ఆమె పడే బాధ ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు. ఎంతో తాగుడుకు బానిసైన నాజర్ మంచిగా మారిన తర్వాత మాధవి (శారద)పై కన్నేసిన అప్పారావు (తనికెళ్ల భరణి).. సత్యాన్ని దారుణంగా పొడిచి చంపాడు. థియేటర్లో ఈ సీన్ చూసిన ప్రేక్షకులు జాలి పడకుండా ఏకంగా నన్ను కూడా పొడిచి చంపాలని కోపంతో ఊగిపోయారు. అంతగా ఆ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది మాత్రమే కాకుండా ఆమె సినిమాలో తనికెళ్ల భరణి మరదలిపై కన్నేసి ఆమె పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తిస్తాడు.

తనికెళ్ల భరణి చేసిన ఈ రెండు పాత్రలు అతని జీవితంలో ఎన్నో చేదు సంఘటనలను ఎదుర్కొనేలా చేశాయి. మాతృదేవోభవ సినిమా తర్వాత పెరట్లో కూర్చుని పేపర్ చదువుతుండగా ఆ వీధిలోకి కూరగాయలు అమ్మే ఆవిడ నా దగ్గరకు వచ్చి.. నన్ను కోపంగా చూసి ఏం సారూ.. ఆయన్ని అట్టా చంపేశారు’ అని అడిగింది. సినిమానే కదా అని నేను అనగా.. సినిమా అయితే మాత్రం అన్నిసార్లు పొడుస్తావా అంటూ నిలదీసింది.

ఈ విధంగా ఆ మహిళ అన్నప్పుడు నా పాత్ర పై నాకే కోపం వచ్చింది. అదేవిధంగా ఒక సారి అవుట్ డోర్ షూటింగ్ వెళ్లినప్పుడు ఒక ఊరిలో ఈ వెధవ మా ఊరు ఎందుకు వచ్చావు అంటూ బూతులు తిట్టారు.అదే విధంగా ఆమె సినిమా విడుదల అయినప్పుడు తన భార్య మరదళ్ళతో కలిసి థియేటర్ కి వెళ్ళాము. ఆ సినిమాలో మరదలిని వేధించే పాత్ర కావడంతో ఈ సినిమా చూసిన తర్వాత నా మరదలు నా వంక ఏదో తేడాగా చూసేది అంటూ ఈ పాత్రలు ప్రేక్షకులలో ఏ విధంగా నాటుకుపోయాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు అంటూ చెప్పుకొచ్చారు.































