ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి మాట వచ్చేసరికి ఏదోటి చెప్పి తప్పించుకుంటున్నారు.. పెళ్లి వయసు దాటుతున్నా కానీ.. మన హీరోయిన్లు మాత్రం ఏం పట్టనట్టు ఉంటున్నారు.. ఇక ఇదిలా ఉంటె మరోవైపు కొందరు హీరోయిన్లు మాత్రం కెరీర్ ని బిల్డ్ చేసుకొని ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయింది..ఆ హీరోయిన్ మరెవరో కాదు పూర్ణ..

ఎప్పట్నుంచో తమ పెళ్లి పై చాలానే కలలు కన్నది పూర్ణ…కానీ ఆమెను ఆ మధ్య ఓ ముఠా పెళ్లి కొడుకు రూపంలో వచ్చి పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యవహారం గురించి తెలిసిందే. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన ఈ న్యూస్, ఆ సమయంలో బాగా వైరల్ కూడా అయింది. చివరకు హీరోయిన్ ను మోసం చేయాలని ప్లాన్ చేసిన ఆ మోసగాళ్లను కటకటాల పాలు చేశారు.

ఇక ఈ నేపథ్యంలో పెళ్లంటేనే తనకు ఒక రకమైన విరక్తి, అపనమ్మకం కలిగింది అని, అందుచేత ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అప్పుడు కాస్త గట్టిగానే చెప్పింది పూర్ణ.మొత్తానికి పెళ్లి అంటే భయంతో వణికిపోయిన ఈ హీరోయిన్, ఎట్టకేలకూ పెళ్ళికి సిద్ధం అయింది. ప్రస్తుతం పూర్ణ పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు. ఎలాగైనా ఈ ఏడాది తమ కుమార్తెకు పెళ్లి చేసేందుకు పూర్ణ తల్లిదండ్రులు వరుడి కోసం ముమ్మరంగా వెతుకులాట మొదలెట్టినట్టు ఉన్నారు.

ఓ సంబంధం కూడా దాదాపు ఫిక్స్ అయ్యేలా ఉందట.మరి పెళ్లి అనంతర తన నటనా జీవితం గురించి, అలాగే తన కెరీర్ గురించి చర్చించి, వరుడిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో పూర్ణ ఉందట. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించిన పూర్ణ, హీరోయిన్ గా మంచి సినిమాలే చేసింది..ఇక ప్రస్తుతం బుల్లితెరపై ఢీ అనే షో లో జడ్జి గా వ్యవహరిస్తోన్న పూర్ణ..తాజాగా బాలయ్య, బోయపాటి అఖండ సినిమాలో ఓ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here