Actress Sanghavi: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు వారి వ్యక్తిగత విషయాలను దాచాలన్నా కూడా బహిర్గతం అవుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలు ఎంతోమంది రెండు మూడు వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు.

ఈ విధంగా రెండు మూడు పెళ్లిళ్లు జరిగిన వారి గురించి మనం వినే ఉన్నాం అయితే నటి సంఘవి విషయంలో మాత్రం ఎవరికీ తెలియని ఒక రహస్యం దాగి ఉంది. ఈమె మొదటిసారిగా ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనికి విడాకులు ఇచ్చిన విషయం చాలామందికి తెలియదు. ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన సంఘవి రెండో వివాహం చేసుకొని ప్రస్తుతం జీవితంలో సెటిల్ అయ్యారు.

అయితే సంఘవి మొదటి భర్త ఎవరు ఆమె ఎందుకు విడిపోయిందనే విషయాన్ని వస్తే… సంఘవి కన్నడ నటి అయినప్పటికీ తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో నటించారు. ఈమె తండ్రి వృత్తిపరంగా డాక్టర్ ఈమెను కూడా డాక్టర్ చేయాలని భావించారు అయితే సంఘవికి డాన్స్ అంటే ఇష్టం ఉండడం చేత తనకు డాన్స్ నేర్పించాలని భావించారు.
ఈమె డాన్స్ చూసిన డైరెక్టర్ శెల్వ ఏకంగా ఈమెను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ విధంగా తెలుగు తమిళ కన్నడ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంఘవి 1998 లో శివయ్య సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సురేష్ వర్మతో ప్రేమలో పడ్డారు.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘవి..
ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. పలు కారణాలు వల్ల విడాకులు తీసుకున్న సంఘవి తిరిగి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే సంఘవి 42 సంవత్సరాల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చి ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ బిజీగా ఉన్నారు.


































