ఆదాయపు పన్ను శాఖ 2020 – 2021 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ల కోసం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. నూతన నిబంధనల్లో 50 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించి ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సాధారణ రిటర్న్ ఫామ్ ను ప్రధానంగా స్థిరాస్తుల నుంచి ఆదాయం, వడ్డీ పొందే వాళ్ల కోసం, జీతం మరియు పెన్షన్ తీసుకునే వాళ్ల కోసం రూపొందించింది.

అసెసీ ఆదాయంలో భార్య, మైనర్లు సంపాదించే ఆదాయాన్ని పొందుపరచాలని పేర్కొంది. విదేశాల్లో సైనింగ్ అథారిటీ ఉన్నా, ఇతర కంపెనీల నుంచి వడ్డీని పొందుతున్నా, అన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్లు గతేడాదిలో ఉన్నా సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. గుర్రపు పందేలు, లాటరీలు, వ్యవసాయం నుంచి 5 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందేవారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు.

హౌజ్ ప్రాపర్టీ నుంచి నష్టాలు, ఇతర ప్రాపర్టీల నుంచి నష్టాలు పొందుతున్న వారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. ఎవరైనా కోటి రూపాయల మొత్తాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటినా, ఫారిన్ టూర్ బిల్లు రెండు లక్షల రూపాయలు దాటినా ఫామ్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.

ఈక్విటీ షేర్ల అమ్మకంతో వచ్చిన లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను వేరుగా చూపించడంతో పాటు ఏ1, బీ1 క్యాపిటల్ గెయిన్స్ ను కలిపి చూపకుండా విడిగా చూపాల్సి ఉంటుంది. మరోవైపు 2018 – 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్, జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ కు గడువును ఆదాయపు పన్ను శాఖ రెండు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here