Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందినఅల్లు అర్జున్ తన సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెకేషన్ ప్లాన్ చేయడం లేదా ఇంట్లోనే సరదాగా పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడం చేస్తుంటారు.

ఇలా పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటూ ఉన్నటువంటి వీడియోలను అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నటువంటి వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ తన ఇంటి ఆవరణంలో నవారు మంచం పై పిల్లలతో కలిసి పడుకుని ఆకాశంలోకి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో సరదాగా గడిపారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అల్లు అర్జున్ ఇలా పెద్ద స్టార్ అయిండుకొని తన పిల్లలని ఏసి గదులకే పరిమితం చేయకుండా ఇలా ఆరు బయటకు తీసుకువచ్చి కబుర్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun: గదులకు పరిమితం చేయకూడదు…
ఇక ఈ ఫోటోలపై మరికొందరు స్పందిస్తూ పిల్లలను ఎప్పుడు గదులకు పరిమితం చేయకుండా ఇలా వారిని ఆడిస్తూ ఉండడం ఎంతో బాగుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

































