Asha Saini: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే వారికి ఎలాంటి కష్టాలు ఉండవని చాలామంది భావిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం వాళ్లు కూడా సామాన్యమైన వ్యక్తులేనని వాళ్లు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుస్తోంది ఈ క్రమంలోనే వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పాత్రలో నటించిన ఆశ షైనీ గురించి అందరికీ పరిచయమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన జీవితంలో పడినటువంటి ఇబ్బందుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఈమె తన ప్రియుడు గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈమె తన బాయ్ ఫ్రెండ్ నుంచి ఎన్నో చిత్రహింసలను ఎదుర్కొందని తాను తన పట్ల లైంగికంగా ఎంతగానో హింసించి దాడి చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ 2007లో తన బాయ్ ఫ్రెండ్ గౌరంగ్ జోషి.. తననిఎంతో టార్చర్ పెట్టారని ఈమె వెల్లడించారు తనకోసం తన కుటుంబాన్ని వదిలి రావడంతో ఆయనలో పెద్ద మార్పు వచ్చిందని తరచు తనని ఎన్నో చిత్రహింసలకు గురి చేసే వారని తెలిపారు.
ఒకానొక సమయంలో తను తనని కొట్టడం వల్ల దవడ పగిలిందని తాను కూడా శ్రద్ధ వాకర్ లాగా ఎక్కడ హత్యకు గురవుతానోనని భయపడ్డానని ఈమె తెలిపారు.ఇలా తను కొట్టడంతో ఒకసారి ప్రాణాలు పోతాయని భావించాను. ఆ సమయంలో తన ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదా అని కూడా చూసుకోకుండా రోడ్డు వెంట పరుగులు పెట్టానని ఈమె షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

Asha Saini: పోలీసులను ఆశ్రయించిన నమ్మలేదు…
ఇలా తన గురించి తన పట్ల ప్రవర్తించే విధానం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా మొదట్లో వారు నమ్మలేదని తర్వాత రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారని ఈ సందర్భంగా ఆశాసైని తన ప్రియుడు గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.