కొంతమంది హీరోయిన్ లు అందం అభినయం రెండూ ఉన్న అదృష్టం మాత్రం ఉండదు.. ఎంత అందాల ప్రదర్శన చేసినా, ఎంత బాగా నటించినప్పటికీ అవకాశాలు సరైనవి రావు.. దాంతో వారు కొన్ని సినిమాలకే కనుమరుగైపోతున్నారు.. వారిలో లావణ్య ఒకరు.. ఇన్ని సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంకా అదృష్టంతో పోరాడుతూనే ఉంది.. ఆమెకు ఎంతో టాలెంట్ ఉన్నా లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమెకు ఏదీ కలిసి రావట్లేదు..

యంగ్ హీరోలతో చేస్తున్నా ఆమెకు పెద్ద హీరోలతో సినిమా ఛాన్స్ లు రావట్లేదు. వచ్చినా అవి హిట్ కావట్లేదు. దాంతో ఆమె మళ్ళీ యధాస్థానానికి వచ్చి ఆగిపోతుంది. ముందునుంచి సాంప్రదాయ బద్ధమైన పాత్రలు చేయడానికి ఇష్టపడే లావణ్య ఈమధ్యే గ్లామర్ పాత్రలు పోషించడం కూడా ప్రారంభించింది..ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో చూపించిందో అందరికి తెలిసిందే.. దీంతో ఈ ముద్దుగుమ్మ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరు తెగ ఆశ్చర్యపోయారు. ఇప్పటికైనా ఈమెకు ఛాన్స్ లు రావాలని కోరుకున్నారు.. నిజానికి కెరీర్ బిగినింగ్ నుంచి ఆమె ఇంతలా ఎక్స్పోజ్ చేసిన సందర్భాలు లేవు.

మొన్నటి A1 ఎక్స్ ప్రెస్ లో కూడా లావణ్య లెక్కకు మించి ఆరబోసింది.. ఇదిలాఉంటే సోషల్ మీడియా లో ఇప్పుడు లావణ్య త్రిపాఠి గురించి తెగ సెర్చింగ్ జరుగుతుంది. 1990డిసెంబర్ 15 న ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది లావణ్య. ఈమె తండ్రి రాఘవేంద్ర త్రిపాఠి హైకోర్టు లాయర్. తల్లి జానకి త్రిపాఠి స్కూల్ టీచర్. లావణ్య త్రిపాఠిని ముద్దుగా లావణ్య , త్రిప అని పిలుస్తారట. ఉత్తరాఖండ్ మార్షల్ హైస్కూల్లో చదివింది. ముంబై నేషనల్ కాలేజీలో ఎకానమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. లావణ్యకు శివాని అనే సిస్టర్, అక్షయ్ త్రిపాఠి అనే బ్రదర్ ఉన్నారు.ఈమె మొదటి 13లక్షలు రెమ్యునరేషన్ తీసుకోగా ఆతర్వాతనుంచి 37లక్షలు అలా ఇంకా పెంచుకుంటూ వచ్చింది. కోకాపేటలో 80లక్షల విలువైన అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. రెండు ఖరీదైన కార్లున్నాయి. షూటింగ్స్ కోసం హైదరాబాద్ వస్తే, హోటల్స్ లో ఉండాల్సి వస్తుందని 2018లో ఈ ప్లాట్ కొనుగోలుచేసింది.

































