ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్గుడిలో జన్మించిన ఆయన ఎనో భాషల్లో పాటలు పాడారు. బప్పి లహిరి తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు పాడారు మరియూ సంగీత దర్శకుడిగా పనిచేశారు.. తెలుగులో అయన సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు.

అయన వయసు 69 ఏళ్ళు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ముంబైలోని ప్రముఖ ఆసుపతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 80-90వ దశకంలో తన మ్యూజిక్‌తో దేశాన్ని ఒక ఊపుఊపేశారు.. తెలుగులో సూపర్ పాపులర్ అయిన అయన పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాం.. అయన చివరగా 2021లో భాగి-౩ లో ఒక పాట పాడారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

































