Bigg Boss: బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్లుగా తల్లి కూతుర్లు… షో రేటింగ్ బ్లాస్ట్ కావాల్సిందే?

0
32

Bigg Boss: బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలోని ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా ఈ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరు సీజన్లో పూర్తి చేసుకుని ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశారు. అయితే ఈసారి మాత్రం ఎప్పటిలా కాకుండా మరింత కొత్తగా వినోదాత్మక భరితంగా ఉండబోతుందని నాగార్జున ఈ కార్యక్రమం గురించి తెలియజేశారు. దీంతో ఈ కార్యక్రమం పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈ సీజన్ లో మాత్రం ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీలను మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించాలని మేకర్స్ భావించారట.ఇలా కంటెస్టెంట్ల కోసమే భారీగా రెమ్యూనరేషన్ ఇస్తూ వారిని ఈ కార్యక్రమంలోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

Bigg Boss: సురేఖ వాణి….సుప్రీత


ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్నటువంటి నటి సురేఖ వాణి కూడా రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.అయితే గత సీజన్ల నుంచి ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదంటూ ఈమె ఖండిస్తున్నారు కానీ ఈసారి మాత్రం పక్కాగా ఉండబోతుందని ఈమెతో పాటు తన కుమార్తె సుప్రీత కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.