బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన రెండవ రోజు నుంచి కంటెస్టెంట్ ల మధ్య అసలుసిసలైన ఆట మొదలైంది. మొదటి రోజు కంటెస్టెంట్స్ అందరూ ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ రెండవ రోజు నుంచి అసలైన ఆట ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ అందరూ గ్రూపులుగా విడిపోయి చిన్న చిన్న విషయాలకే రచ్చ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నామినేషన్స్ కంటెస్టెంట్ ల మధ్య మరింత చిచ్చు పెడుతున్నాయని చెప్పవచ్చు.

ఈ విధంగా బిగ్ బాస్ మొదటివారం ఎంతో విజయవంతంగా ప్రసారం అయినప్పటికీ హౌస్ నుంచి కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ అయ్యారు.ఇక రెండో వారం నామినేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది తెలియని వాళ్ళు ఉండటం వల్ల కొంత వరకు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హాట్ బ్యూటీస్ ని హౌస్ లోపలికి పంపించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీవీ ఆర్టిస్ట్ నవ్య స్వామి, బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ వర్షిణిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించనునట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
టీవీ షోల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వర్షిణి సోషల్ మీడియావేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకుంది. అలాగే నా పేరు మీనాక్షి,ఆమె కథ వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నవ్యస్వామి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఆ కథే వేరే ఉంటుందని చెప్పవచ్చు. అయితే వీరిద్దరిని ఒకే వారంలో హౌస్ లోకి పంపిస్తారా? లేక ఒక్కో వారంలో ఒక్కొక్కరిని పంపిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ఈ హాట్ బ్యూటీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టి ప్రేక్షకులను మరింత సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
































