మరో తొమ్మిది రోజులలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన గడువు ముగియనుంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితి చూస్తుంటే లాక్ డౌన్ పొడిగింపు తప్పదేమో అనిపిస్తుంది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. గత నాలుగైదు రోజులల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాలలో కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ముఖ్యంగా మార్కెజ్ వెళ్లి వచ్చిన వారి పై ఈ వైరస్ ప్రభావం విపరీతంగా ఉంది. వారి నుంచి మరికొంత మందికి వ్యాపించే ప్లేరమాదం లేకపోలేదు.

మన దేశంలో ఇప్పటి వరకు 3577 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 427 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 83కి చేరుకుంది. అటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఎంతమందికి వైరస్ సోకింది అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే గత రెండు రోజుల్లో ఈ కేసులు పెద్ద ఎత్తున పెరిగాయి.

లాక్ డౌన్ గడువు ముగియడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఈలోగా కేసుల సంఖ్య తగ్గి పరిస్థితి అదుపులోకి రాకపోతే మాత్రం ఆ గడువును మరింతగా పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. లాక్ డౌన్ ఇక పొడిగించే అవకాశం లేదని కేంద్రం చెబుతుంది. కాని కొన్ని రాష్ట్రాలలో ఈ వైరస్ ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో లాక్ డౌన్ ను పెంచే అవకాశం ఉందని నిపుణుల చెబుతున్నారు. మరో 15 రోజులు అంటే ఏప్రిల్ 30 వరకు ఈ లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.




























