ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల కరోనా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలన్నింటిలో అస్తవ్యస్తం చేసింది. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని వార్తలు వినిపించడంతో అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఈ క్రమంలోనే భారతదేశంలో రెండవ దశ కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులు మూడవ దశ ఎదుర్కోవడం కోసం ముందస్తు చర్యలు చేపట్టారు. భారతదేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే రాబోయే థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలపై చూపుతుందని నిపుణులు హెచ్చరించడంతో చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్
రణ్‌దీప్ గులేరియా తెలిపారు.
సెప్టెంబర్ నెల ఆఖరి లోపు చిన్న పిల్లలలో కూడా వాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెట్టడం కోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నట్టు గులేరియా స్పష్టత నిచ్చారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ల కోసం మొత్తం మూడు కంపెనీలకు కలిపి ఆగస్టు సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ప్రభావం చూపించడం వల్ల వారికి కూడా వ్యాక్సిన్ వేయటంతో ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు కూడా బ్యాక్ సైడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడే వారు ఈ వైరస్ నుంచి కొంత వరకు ఉపశమనం పొందుతారని చెప్పవచ్చు.



































