ఆ కెమికల్ తో కరోనా వైరస్ కు చెక్..?

0
160

భారతదేశంలోని ప్రజలు కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ప్రజల్లో ఆందోళనను పెంచుతూ కొత్త భయాలను సృష్టిస్తోంది. కరోనా వైరస్ వల్ల ప్రజల జీవన విధానంలో పూర్తిగా మార్పులొచ్చాయి. భవిష్యత్తులో కరోనా విజృంభణ తగ్గినా సాధారణ పరిస్థితులు ఏర్పడటం మాత్రం అంత తేలిక కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వైరస్ ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తూ కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కీలక విషయాలను వెల్లడించారు. నైట్రస్ ఆక్సైడ్ అనే కెమికల్ కాంపౌండ్ తో కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్వీడన్ దేశానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

2003 సంవత్సరంలో సార్స్ ను ఏ విధంగా కట్టడి చేయగలిగామో కరోనా మహమ్మారిని కూడా అదే విధంగా కట్టడి చేయడం సాధ్యమవుతుందని వెల్లడించారు. రెడాక్స్ బయాలజీ అనే జర్నల్ లో పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు నైట్రస్ ఆక్సైడ్ కరోనాపై ప్రత్యక్షంగా ప్రబావం చూపగలదని.. కొన్ని సందర్భాల్లో మానవ శరీరంలోనే నైట్రస్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు.

తాము చేసిన పరిశోధనల్లో నైట్రస్ ఆక్సైడ్ కరోనా వైరస్ పై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా వల్ల ఎవరిలోనైనా లంగ్స్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వస్తే అలాంటి సమయంలో గ్యాస్ రూపంలో నైట్రస్ ఆక్సైడ్ ను ఇవ్వడం వల్ల కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే నైట్రస్ ఆక్సైడ్ గురించి మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here