Crime News: ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఆడపిల్లలపై దాడులు ఆగడం లేదు. అఘాయిత్యాలకు పాల్పడుతూ.. బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. దీంతో పాటు వారిపై దాడుల కూడా పాల్పడుతున్నారు. రోజుకు ఎక్కడో ఓ చోట మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి.

తాజాగా సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం ఎరుగని ఓ బాలికపై ఓ నిందితుడు.. దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. బూటుతో తన్నుతూ.. కర్రతో బాదుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు.

ఢిల్లీలో పశ్చిమ విహార్ ప్రాంతంలో ఈ అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై దాడికి పాల్పడుతున్న వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలికను పట్టుకుని సదరు వ్యక్తి కర్రలతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. పారిపోయేందుకు బాలిక ప్రయత్నించినా.. వదలకుండా దాడి చేశాడు. అనంతరం బూటు కాలితో తీవ్రంగా తన్నాడు.
బాధిత బాలికను కొందరు…
దీనిపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ మహిళా కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పుటేజీని అందచేసింది. నిందితుడు డ్రగ్స్ కు బానిసగా మారినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత బాలికను కొందరు బంధించినట్లు ఆమె.. జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.































