Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు వారసుడు సినిమా ద్వారా తరచు వార్తలు నిలుస్తున్నారు. ఇక నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేస్తూ పెద్ద ఎత్తున నైజాం ఏరియాలో సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మైత్రి వాళ్ళు నైజాంలో తమ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ మొదలుపెట్టారు.

ఇలా నైజాంలో మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడంతో తన బిజినెస్ ప్రభావం చూపుతుంది అన్న దిల్ రాజు ఏకంగా ఇండస్ట్రీలో నిర్మాతలను టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే వారసుడు సినిమా మైత్రి మేకర్స్ నుంచి వస్తున్న సినిమాలకు టార్గెట్ అయింది ఈ క్రమంలోనే దిల్ రాజు మైత్రి వాళ్లకు తన థియేటర్లో ఇవ్వడం లేదని తన థియేటర్లు మొత్తం వారసులు సినిమాకి ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.
ఇదిలా పక్కన పెడితే శాకుంతలంవిషయంలో కూడా దిల్ రాజు తెలుగు నిర్మాతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే శాకుంతలం సినిమా విడుదల విషయంలో ఆ నిర్మాతలను ఈయన టార్గెట్ చేశారని భావిస్తున్నారు.సమంత నటించిన శకుంతలం సినిమాని ఫిబ్రవరి 17వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇదే రోజున వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సర్ సినిమా కూడా విడుదల కానుంది ఈ సినిమాని సితార సంస్థ నిర్మించారు. ఇక అదే రోజే విశ్వక్సేన్ ధమ్కీ సినిమా విడుదల కానుంది.

Dil Raju: సితార, గీతా వారికి చెక్ పెట్టే ప్రయత్నంలో దిల్ రాజు…
విశ్వక్ ధమ్కీ సినిమాకు ఆయనే నిర్మాతగా, దర్శకత్వం వహించారు. ఇక గీత ఆర్ట్స్ నుంచి వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కూడా రాబోతుంది ఈ చిత్రాన్ని బన్నీ వాసు గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ద్వారా నిర్మించారు ఇలా ఫిబ్రవరి 17వ తేదీ ఉద్దేశపూర్వకంగానే దిల్ రాజు సితార గీత ఆర్ట్స్ బ్యానర్లకు చెక్ పెట్టడం కోసమే శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు ఫిక్స్ చేశారని తెలుస్తోంది.































