Director Tharun Bhaskar: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య చిన్న విషయాలకు తీవ్రస్థాయిలో గొడవలు పడుతూ విడిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు విడాకులను తీసుకొని విడిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ జంటలు విడిపోగా తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ ఐశ్వర్య ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరొక డైరెక్టర్ కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

పెళ్లి చూపులు సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన భార్య లత గత కొద్దిరోజుల నుంచి విడివిడిగా ఉంటున్నట్లు టాలీవుడ్ సమాచారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భాస్కర్ కొన్ని మనస్పర్థల కారణంగా తన భార్యతో విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు పొందిన లత..
తరుణ్ భాస్కర్ డైరెక్టర్ కాకముందే లతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లతా ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈమెను తరుణ్ భాస్కర్ ఎన్నో ఇంటర్వ్యూలలో తన గురించి ప్రస్తావించారు.ఇలా ఎన్నో కార్యక్రమాలలో తన గురించి గొప్పగా చెబుతున్న తరుణ్ భాస్కర్ ఆమెతో కొన్ని మనస్పర్థల కారణంగా విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ డైరెక్టర్ దంపతులు విడాకుల గురించి తెలియచేయబోతున్నారని తెలుస్తోంది.































