Anchor Lasya: యాంకర్ లాస్య, యాంకర్ రవి జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు గత 5 సంవత్సరాల క్రితం వీళ్ల యాంకరింగ్ చేసిన ప్రతీ షో టీఆర్పీ రేటింగ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయేది. వీళ్లిద్దరు కలసి చేస్తే చాలు ఇక.. ప్రశాతంగా ఉండొచ్చు అని షో నిర్వాహకులు ఆలోచించేవాళ్లు.

మధ్యలో ఏమైందో ఏమో గానీ.. యాంకర్ రవి కంటిన్యూ అయినా.. లాస్య మాత్రం 4 ఏళ్ల పాటు బుల్లితెరకు దూరంగా ఉన్నారు. ఎలాంటి షోలు చేయకుండా.. సోషల్ మీడియాలో కూడా కనపడకుండా.. అస్సలు ఆమె జాడ కూడా తెలియదు అన్నట్లుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఆ నాలుగేళ్లతో ఎన్నో రూమర్స్ వచ్చాయి.

తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశం వచ్చిన తర్వాత ఆమె మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. బిగ్ బాస్ లో తనదైన శైలిలో సందడి చేస్తూ..తన అభిమానులను మళ్లీ అలరించారు. బయటకు వచ్చిన తర్వాత ఇక టీవీ షోలో మెరుస్తూ సోషల్ మీడియా అకౌంట్లలో తన ఫాలోవర్స్ ను ఇంకా పెంచుకున్నారు.
ఆయన కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నానంటూ..
అయితే రవితో ఆ జోడీ కొనసాగిద్దామని ఇద్దరూ ప్రయత్నించారు. ఒకటి రెండు షోల్లో యాంకరింగ్ గా జోడీ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఇక ఆమెకు పెళ్లి కావడం.. లాస్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడని బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాతనే ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి అంటే ఆమెకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రోగ్రామ్ లో ఆమె మాట్లాడుతూ.. మా పాత ఇల్లు కూల్చేశాం. ఆ స్థానంలో తాము కొత్త ఇంటిని నిర్మిస్తున్నాం అంటూ చెప్పారు. ఆ ఇల్లు కేవలం తన ఫాదర్ కు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పారు. దానకి సంబంధించి ఓ వీడియోను తన యూట్యూబ్ లో పోస్టు కూడా చేశారు. నాన్న కళ్లలో ఆనందం చూడటానికి నేనేదైనా చేస్తాను. ఆయన సంతోషం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఆయన కోసం ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్నానంటూ ఆ వీడియోలో గదులన్నింటినీ చూపించింది. ఇల్లు దాదాపు పూర్తయిందని.. గృహప్రవేశం రోజున అన్నింటినీ చూపిస్తాను అంటూ చెప్పారు. అంతే కాదు అంతక ముందు ఆమె తన తండ్రికి ఓ ట్రాక్టర్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దీనిలో కూర్చొని సందడి చేస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు.
































