పని ఒత్తిడిలో పడి తినే ఆహారం కూడా టైంకి తినడం లేదు చాలామంది. దీంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆహారం తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. రాత్రి పడుకునే సమయంలో ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా ఇందులో కొన్ని పదర్దాలు తినడం వల్ల మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తీపి పదర్దాలు అనేవి అందరూ ఇష్టపడుతుంటారు. ఇవి అన్నం తిన్న తర్వాత ఇంకా మధురంగా అనిపిస్తుంటాయి. కానీ ఇవి అన్నం తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మధుమేహం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.ఒక వేళ మధుమేహ వ్యాధి ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు నూనెలో వేయించిన ఆహార పదర్ధాలకు దూరంగా ఉంటే మంచిదని తెలియజేస్తున్నారు.
సాధారణంగా మన ఆరోగ్యానికి సరైన పోషకాలను అందించేటువంటి బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు సాధారణంగా ఆరోగ్యానికి చాలా మంచివి కాని వాటిని పడుకునే ముందు అస్సలు తినకూడదు. సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఉంటుంది. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా మన శరీరములు వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.
రాత్రి పడుకునే సమయంలో సిట్రస్ జాతి పండ్లను తింటే మాత్రం కడుపులో ఎసిడిటీ పెరిగి గుండెల్లో మంట రావడానికి దారి తీస్తుంది. ఇది మీకు నిద్ర పట్టకుండా చెయ్యడమే కాకుండా తరువాత రోజు కూడా మీకు గుండెల్లో మంటగా ఉంటుంది. కావున ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను రాత్రిళ్లు తినకపోవడమే మంచిది.
































