బుల్లితెర ప్రేక్షకులకు పరిటాల నిరుపమ్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.పరిటాల నిరుపమ్ అనే దానికన్నా డాక్టర్ బాబు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. బుల్లితెర లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ నటి మంజులను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈటీవీ లో ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమైనా వీరి ప్రయాణం మూడుముళ్ల బంధం వరకు కొనసాగింది. ఈ సీరియల్స్ ద్వారా ప్రేమలో పడిన ఈ జంట నిజజీవితంలో ఒక్కటయ్యారు.

ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న పరిటాల నిరుపమ్ బుల్లితెర శోభన్ బాబుగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఒక వైపు సీరియల్స్ లో ఎంతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా వీరికి సంబంధించిన ప్రతి విషయాలను షేర్ చేసుకుంటూ, ఉండే మంజుల త్వరలోనే తన భర్తతో కలిసి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా నటి మంజుల తన ఫాలోవర్స్ తో ఆదా ?ఇదా? అనే పాటను ఆడుతూ అంటూ ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతూ సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు కార్తీకదీపం ఇష్టమా? హిట్లర్ ఇష్టమా? అని అడగగా మరికొందరు బెంగళూరు ఇష్టమా?హైదరాబాద్ అని అడగగా అందుకు సమాధానంగా మంజుల హిట్లర్ సీరియల్ అంటే ఇష్టం.. హైదరాబాద్ అంటే ఇష్టమని తెలిపారు.

ఈ క్రమంలోనే మరికొందరు ఫాలోవర్స్ కొడుకా? భర్త? అంటే ఇష్టమా అని అడగగా అందుకు మంజుల సమాధానం చెబుతూ ఆ ఇద్దరూ నా రెండు కళ్ళ లాంటి వారు.. నా గుండె చప్పుడు. వీరిలో ఎవరిని విడదీసిన నా ఊపిరి ఆగిపోతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here