ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 మొన్నటి వరకు ఎంతో రచ్చరచ్చగా కొనసాగింది. ఎప్పుడు గొడవలు, కొట్లాటలతో కొనసాగుతున్న బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి.గత 11 వారాల నుంచి ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారో, ఎవరు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా ఎప్పుడూ గొడవలు గా ఉండే ఇంటిలో ఒక్కసారిగా బిగ్ బాస్, హౌస్ వాతావరణాన్ని మార్చేశారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పాటిస్పేట్ చేస్తున్న కంటెస్టెంట్ బంధువులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లడంతో ఎమోషనల్ వాతావరణం ఏర్పడింది. ప్రతి సారి లాగే ఈ సీజన్లో కూడా హౌస్ మేట్ సభ్యులను ఇంట్లోకి పంపించడంతో తమ వారిని చూసుకుని ఒకసారి గా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే తొలిరోజు అఖిల్, అవినాష్,అభి,హారిక ఇక తమ వాళ్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

రెండవ రోజు హౌస్ లోకి సోహెల్,అరియాన, లాస్య కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంటరయ్యారు. అయితే ముందుగా లాస్య కొడుకు జున్ను హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే లాస్య తన కొడుకుని చూసి పరుగులు పెట్టి తన కొడుకును హత్తుకుని ఏడ్చేసింది. తరువాత ఆమె భర్త మంజునాథ్ కూడా అక్కడికి వచ్చాడు. మంజునాథ్ హౌస్ లోకి రాగానే కుటుంబ సభ్యులతో పరిచయం చేసుకొని ఎంతో ప్రేమగా అందరినీ పలకరించాడు.వీరు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు లాస్యని ఎప్పుడు ఆంటీ అని ఆట పట్టిస్తుంటారు. ఒకసారి నాగార్జున కూడా ఏంటీ ఏంటి లాస్యని ఆంటీ అని పిలుస్తున్నారు అనేసారు.

ఇంటి సభ్యులు లాస్యను ఎప్పుడు ఆంటీ అని ఆటపట్టిస్తూ వెక్కిరించేవారు. అలా అనొద్దు అని లాస్య ఎన్నిసార్లు చెప్పినా వారు అలాగే ఆటపట్టిస్తూ ఉండేవారు. ప్రస్తుతం లాస్య భర్త మంజునాథ్ హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా లాస్యని ఆంటీ అని అఖిల్, సోహెల్ సరదాగా ఆట పట్టించారు. దాంతో మంజునాథ్ వారికి వేలు చూపించి నా భార్యను ఆంటీ అని పిలవద్దు అలా అన్నారో మీరు అంతే అని అని వారికి సరదాగా హెచ్చరించారు. తరువాత మంజునాథ్ కుటుంబసభ్యులకు కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో లో అందరూ ఎంతో సరదాగా గడుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here